
Heatwave: నిప్పులు కక్కుతున్న సూరీడు.. హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
వడగాల్పులతో దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
ఇప్పటికే పలుచోట్ల 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది.
ఈ సమయంలో ఐఎండీ ఎండలు మరింత పెరగే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వడగాలులు తప్పవని, ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశముందని పేర్కొంది.
Details
మే మూడో వారంలో వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్‌లో పెరిగిన ఎండతీవ్రత నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి.
జియాగూడలో మంగళవారం 43.2 డిగ్రీల సెల్సియస్, రెయిన్ బజార్ వద్ద 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
లంగర్ హౌజ్, మాదాపూర్‌లో 43 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది .
మే మూడో వారంలో వర్షాలు కురిసే అవకాశంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ-హైదరాబాద్ అధికారులు అంచనా వేస్తున్నారు.