
Singareni: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గుదల.. విద్యుత్ ప్లాంట్లకు పెరిగిన బెడద!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. వర్షాల ప్రభావం సింగరేణి గనులపై కూడా తీవ్రంగా పడింది. సాధారణంగా రోజుకు 2.20 లక్షల టన్నుల బొగ్గు డిమాండ్ ఉన్నప్పటికీ, వర్షాల కారణంగా ఉత్పత్తి లక్షన్నర టన్నుల కన్నా తక్కువగా పడిపోవడంతో పరిశ్రమలతో పాటు విద్యుత్ కేంద్రాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. బొగ్గు సరఫరా అంతరించిపోవడంతో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోయాయి. నిబంధనల ప్రకారం, ప్రతి థర్మల్ ప్లాంట్‌లో కనీసం 22 రోజుల అవసరాలకు సరిపడే బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ భద్రాద్రి విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం కేవలం 14రోజుల సరిపడే స్టాక్ మాత్రమే ఉందని సమాచారం.
Details
బొగ్గు కొరత తలెత్తే అవకాశం
ఈ స్థాయిలో నిల్వలు ఉండే కేంద్రాలను రెడ్ లిస్టులో చేర్చుతారు. ఈ పరిస్థితి తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ప్లాంట్లకు ప్రభావం చూపనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ థర్మల్ స్టేషన్‌తో పాటు తెలంగాణలోని భద్రాద్రి ప్లాంట్, మరికొన్ని రాష్ట్రాల్లోని మొత్తం 13 థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత తలెత్తే అవకాశముందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇకపోతే దేశీయంగా బొగ్గు ఉత్పత్తి తక్కువగా ఉండటమే కాకుండా, విదేశాల నుంచి దిగుమతి కావలసిన బొగ్గు రవాణాలో కూడా ఆలస్యం జరుగుతోంది. దీనివల్ల కేంద్ర విద్యుత్ మండలి ప్రకారం నిల్వలు మరింతగా తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ప్లాంట్లకు ఇంకా సరిపడా బొగ్గు సరఫరా కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Details
ప్రతిరోజూ బోగ్గు సరఫరా
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 184 థర్మల్ విద్యుత్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ఇవి కలిపి 2.15 లక్షల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. తీర్వత తగ్గించే అంశం ఏంటంటే... ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలో పెద్దగా ఆటంకాలు లేవు. కోల్ ఇండియా గనుల నుంచి ప్రతిరోజూ బొగ్గు సరఫరా కొనసాగుతోంది. అక్కడ వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ గనుల కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి.