
AP Govt : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. రేపు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతులు, సూచనలు అందించనున్నాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం తుది నివేదికను అధికారులు సిద్ధం చేయనున్నారు. అలాగే ఇంజినీరింగ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇతర శాఖల్లో ఉద్యోగుల బదిలీపై ఆన్‌లైన్ ఓటింగ్ కొన్ని ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్నాయి.
Details
మూడు కేటగిరీలుగా విభజన
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విధంగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలకు - A కేటగిరీ (6 మంది ఉద్యోగులు) 3,500 జనాభా వరకు ఉన్న సచివాలయాలకు - B కేటగిరీ (7 మంది ఉద్యోగులు) 3,500 పైగా జనాభా ఉన్న సచివాలయాలకు - C కేటగిరీ (8 మంది ఉద్యోగులు) ఈ విభజన కారణంగా దాదాపు 40,000 మంది ఉద్యోగులు మిగిలిపోయారు. వారిని ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తోంది.