Page Loader
US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా 
US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా

US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా 

వ్రాసిన వారు Stalin
Jan 29, 2024
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023లో భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు పొందారు. గత సంవత్సరం 14లక్షల యూఎస్ వీసాలను జారీ చేసినట్లు భారతదేశంలోని అమెరికా కాన్సులర్ బృందం పేర్కొంది. విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ల కోసం వేచి ఉండే సమయం కూడా 75శాతం తగ్గిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ వీసాలు కలిగి ఉన్న ప్రతి 10మందిలో ఒకరు భారతీయులేనని యూఎస్ ఎంబసీ తెలిపింది. 2023లో అమెరికా కాన్సులెట్ 1.40లక్షలకు పైగా భారతీయ విద్యార్థి వీసాలను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్‌లో ముంబై, దిల్లీ, హైదరాబాద్, చెన్నై కేంద్రాలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య అత్యధికంగా మారింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 10లక్షలకుపైగా ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

75శాతం తగ్గిన వెయిటింగ్ పీరియడ్