
NCP vs NCP: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ గ్రూపునే అసలైన ఎన్‌సీపీగా గుర్తించిన ఎన్నికల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. శరద్ పవార్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. అజిత్ పవార్ గ్రూపునే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
అన్ని ఆధారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఎన్సీపీ పేరును, ఎన్నికల గుర్తును ఉపయోగించుకునే హక్కు అజిత్ పవార్ వర్గానికి ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుకు ముగ్గురు పేర్లను ప్రతిపాదించాలని శరద్ పవార్‌ను ఎన్నికల సంఘం కోరడం గమనార్హం.
ఈ పేర్లను బుధవారం మధ్యాహ్నం 3 గంటలలోపు ఇవ్వాలని గడువు విధించింది. 6 నెలలకు పైగా సాగిన 10కి పైగా విచారణల తర్వాత ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఎన్సీపీ
మెజార్టీని నిరూపించుకోలేకపోయిన ఎన్సీపీ
పార్టీ లక్ష్యాలు, పార్టీ రాజ్యాంగం, సంస్థాగత, శాసన మెజారిటీని దృష్టిలో ఉంచుకొని అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గానికి అనుకూలంగా ఎన్నికల తీర్పు ఇచ్చింది.
ఎన్నికల సంఘం ప్రకారం, శరద్ పవార్ వర్గం మెజారిటీని సకాలంలో నిరూపించుకోలేకపోయింది.
మహారాష్ట్ర నుంచి 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు గడువును దృష్టిలో ఉంచుకుని, శరద్ పవార్ వర్గానికి ఎన్నికల ప్రవర్తనా నియమాలు 1961లోని రూల్ 39AAను అనుసరించడానికి ప్రత్యేక రాయితీ ఇవ్వబడింది.
ఫిబ్రవరి 7 సాయంత్రంలోగా కొత్త పార్టీ ఏర్పాటుకు ముగ్గురి పేర్లను ఇవ్వాలని ఈసీ కోరింది. గతేడాది అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండు ముక్కలుగా చీలిపోయిన విషయం తెలిసిందే.