LOADING...
India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు 
ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు

India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు 

వ్రాసిన వారు Stalin
Oct 07, 2023
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాలస్తీనా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాకెట్ల వర్షాన్ని కురిపించాయి. అనంతరం మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి కొందరు పౌరులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు శనివారం ఒక సలహా జారీ చేసింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని అధికారులు కోరారు. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని ఎంబసీ అధికారులు పౌరులను కోరారు.

పాలస్తీనా

మేము యుద్ధం గెలుస్తాము: ఇజ్రాయెల్ ప్రధాని 

గత సంవత్సరాల్లో ఇజ్రాయెల్‌పై అతిపెద్ద దాడిలో గాజా నుంచి హమాస్ దాదాపు 5,000 రాకెట్లను ప్రయోగించిన తర్వాత ఇజ్రాయెల్ శనివారం ఉదయం 'యుద్ధ స్థితి' ప్రకటించింది. ఈ బృందంలోని పలువురు సాయుధ ఉగ్రవాదులు కూడా సరిహద్దు దాటి ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామని, తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దళం డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లతో దాడి ప్రారంభించింది.