Student Shot Dead: పరీక్షలో చీటింగ్..రెండు వర్గాల మధ్య వివాదం..టెన్త్ విద్యార్థి కాల్చివేత
ఈ వార్తాకథనం ఏంటి
పదో తరగతి పరీక్షల్లో జరిగిన చీటింగ్ ఆరోపణలు విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.
ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుని, కొంతమంది విద్యార్థులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ విషాదకర సంఘటన బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో చోటుచేసుకుంది.
సాసారామ్ పట్టణంలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 19న విద్యార్థుల మధ్య వాగ్వాదం మొదలైంది.
వివాదం మరుసటి రోజు తీవ్రమై, విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు తుపాకులతో కాల్పులు జరిపారు.
వివరాలు
చికిత్స పొందుతున్నమెడికల్ కాలేజీ ఆసుపత్రికి ప్రత్యేక బందోబస్తు
ఘటనపై న్యాయం కోరుతూ బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
దీనివల్ల సాసారామ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడంతో పాటు, గాయపడిన విద్యార్థులు చికిత్స పొందుతున్న మెడికల్ కాలేజీ ఆసుపత్రికి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.