LOADING...
Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు 
Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు

Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు 

వ్రాసిన వారు Stalin
Oct 03, 2023
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవంచింది. మంగళవారం మధ్యాహ్నం 10సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో 10 సెకన్లకు పైగా ప్రకంపనలు వచ్చాయి. నేపాల్‌లో మధ్యాహ్నం 2:51 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రకంపనలు రావడంతో కార్యాలయాలు, ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆగస్టు 5న, ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు కూడా దిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

10సెకన్ల పాటు ప్రకంపనలు