LOADING...
Food Waste: దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృథా
దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృథా

Food Waste: దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృథా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో సగటున ప్రతి ఏడాది 55 కిలోల ఆహారం వృథా అవుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన "ఆహార వృథా సూచిక- 2024"నివేదిక ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడయ్యాయని ఆయన స్పష్టంచేశారు. ప్రపంచస్థాయిలో చూస్తే,ప్రతి కుటుంబంలో సగటున 79కిలోల ఆహారం వృథా అవుతోందని నివేదిక పేర్కొంటున్నదని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యల్లో భాగంగా దీనిపై అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక,ఈ అంశాన్నిపాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా యువతలో చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.