Page Loader
మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా 
మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా

మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా 

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని అమెరికా ఎంబసీ మన దేశ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది. కేవలం ముడునెలల్లోనే మొత్తం 90,000పైగా స్టూడెంట్ వీసాలు జారీ చేశామని ఎంబసీ సోమవారం వెల్లడించింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ వీసాలను జారీ చేసినట్లు పేర్కొంది. గతేడాది రికార్డు స్థాయిలో 125,000 మంది భారతీయులకు విద్యార్థి వీసాలు జారీ చేశారు. ఏ ఇతర దేశస్థులకు ఇన్ని వీసాలను జారీ చేయలేదని, ఒక్క భారత విద్యార్థులకు మాత్రమే చేసినట్లు అమెరికా కాన్సులర్ వ్యవహారాల తాత్కాలిక మంత్రి సలహాదారు బ్రెండన్ ముల్లార్కీ తెలిపారు. తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్‌ను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ అమెరికన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూఎస్ ఎంబసీ చేసిన ట్వీట్