Page Loader
మణిపూర్‌లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు
మణిపూర్‌లో మరోసారి కాల్పులు; భద్రతా బలగాలు అప్రమత్తం

మణిపూర్‌లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు

వ్రాసిన వారు Stalin
Jun 22, 2023
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో బుధవారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు వినిపించాయి. బిష్ణుపూర్ జిల్లాలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలుడు సంభవించింది. ఆగి ఉన్న వాహనంలో బాంబు అమర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడినట్లు వెల్లడించారు. అలాగే కాంగ్‌పోక్పి జిల్లాలో కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. అయితే గురువారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య అడపాదడపా తుపాకీ కాల్పులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

మణిపూర్

మణిపూర్‌లో చెలరేగుతున్న హింసకు నిరసనగా మీరా పైబిస్ ఆందళన 

అలాగే ఉరంగ్‌పట్ సమీపంలోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో కాల్పుల శబ్ధం వినిపించింది. ఆటోమేటిక్ చిన్న ఆయుధాలతో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అస్సాం రైఫిల్స్ దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇదిలా ఉంటే, మణిపూర్‌లో చెలరేగుతున్న హింసకు నిరసనగా మహిళా సామాజ్య ఉద్యమ వేదిక మీరా పైబిస్ ఆందళన నిర్వహించారు. సావోన్‌బంగ్-వైకెపిఐ రహదారి అనేక ప్రదేశాలలో రోడ్లను నిర్భందించారు. మణిపూర్‌లో గత నెల రోజులుగా గిరిజనులు, మైతీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లు బూడిదయ్యాయి.