BRICS Summit: రష్యాలో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ..
16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. ఈ సమావేశం రష్యాలోని కజాన్ నగరంలో జరగనుంది. రష్యాకు చేరిన ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం కౌగిలించుకుని పలకరించుకున్నారు. మరోవైపు, మరిన్ని దేశాలు బ్రిక్స్‌లో చేరుతున్న నేపథ్యంలో, ఈ సదస్సు విజయవంతం కావాలని ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.
శాంతి కోసం భారత్ సహకరిస్తుందన్న మోడీ..
ఉక్రెయిన్ యుద్ధంపై శాంతియుత పరిష్కారం గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ''రష్యా-ఉక్రెయిన్ సమస్యలో మేము అన్ని వర్గాలతో టచ్‌లో ఉన్నాము. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది మా ధోరణి. వివాదాలకు శాంతియుత పరిష్కారాలు ఉండాలని మేము నమ్ముతున్నాము. శాంతిని నెలకొల్పేందుకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది'' అని ప్రధాని మోడీ తెలిపారు.
'కజాన్ డిక్లరేషన్' విడుదల
ఈ సమావేశంలో 'కజాన్ డిక్లరేషన్' విడుదల చేయబోతున్నారు. బ్రిక్స్ సభ్యులైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా నేతలు ఈ సమయంలో కలుసుకోనున్నారు. ఈ ఏడాది మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, ప్రధాని నరేంద్రమోడీ రష్యాకు రెండోసారి వెళ్లారు. జూలై 22న జరిగిన భారత్-రష్యా వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించి, పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా, ప్రధాని నరేంద్రమోడీకి క్రెమ్లిన్‌లో రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్' పురస్కారంతో సత్కరించారు.