LOADING...
TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! 
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో బోర్డు పరీక్షలు ప్రారంభకానున్న నేపథ్యంలో విద్యాశాఖ సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 4,88,448 మంది, ద్వితీయ సంవత్సరానికి 5,08,523 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,532 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 29,992 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉంటారు.

Details

పరీక్షా భద్రతా చర్యలు

గతంలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. పరీక్షల సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా పక్కా భద్రతా చర్యలు అమలు చేయనుంది. జిరాక్స్ సెంటర్ల మూసివేత పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు సీసీ కెమెరాల ఏర్పాట్లు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు అమర్చడంతో పాటు, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయనున్నారు.

Details

 హాల్ టికెట్ తప్పనిసరి

విద్యార్థులకు హాల్ టికెట్ అందుబాటులో లేకపోతే, సంబంధిత కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పరీక్షా సమయ నియమాలు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే (ఉదయం 8:30 వరకు) అభ్యర్థులు హాల్‌లో ఉండాల్సిందిగా సూచించారు. ఈ చర్యల ద్వారా పరీక్షలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని విద్యాశాఖ కృతనిశ్చయంతో ఉంది.