ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదురుగు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. మంగళవారం జమ్ముప్రాంతంలో భాటా ధురియన్ కు చెందిన తోటగాలి ప్రాతంలో ఆర్మీ ట్రక్ పై ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ ఘటనకు పాల్పడిన వారు కాండి ఫారెస్టులోని ఓ గుహలో ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా ఆర్మీకి సమాచారం అందింది. దీంతో గురువారం నుంచి బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే శుక్రవారం ఉదయం ఉగ్రవాదుల జాడ గుర్తించడంతో రెండు వైపులా ఎన్ కౌంటర్ మొదలైంది. అక్కడి నుంచి తప్పించుకోవాడానికి ఉగ్రవాదాలు పేలుడు పదార్థాలను వాడారు.
ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఈ ఘటనలో ఐదురుగు జవాన్లు మరణించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉదంపూర్ లోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి రాజౌరీ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. 2021 అక్టోబర్‌లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు మరణించిన తర్వాత ఈ ఘటన మళ్లీ చోటు చేసుకోవడం బాధాకరం. పుంజ్ జిల్లాలో జరిగిన దాడితో సంబంధమున్న ఉగ్రవాదుల కదలికలపై గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ ఘాతానికి పాల్పడ్డారని అధికారులు ధ్రువీకరించారు.