
Delhi: అనౌన్స్‌మెంట్ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే ప్రధాన కారణంగా ఉందని పోలీసులు తెలిపారు.
ప్రయాణికులు తికమకపడటంతో ఆపరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. నిన్న రాత్రి తొలుత ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు ప్లాట్‌ఫామ్ నెంబర్ 16 వద్దకు రానుందని అనౌన్స్‌మెంట్ చేశారు.
ఇదే సమయంలో ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే 14వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద నిలిచివుంది.
దీంతో కొందరు తాము ఎక్కాల్సిన రైలు ఇదేనని భావించి అక్కడకు చేరుకున్నారు.
అయితే అనౌన్స్‌మెంట్ విన్న తరువాత అసలైన రైలు 16వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్దకు వస్తుందని తెలుసుకొని భయాందోళనకు గురయ్యారు. దాన్ని అందుకోవాలని వందల మంది 16వ ప్లాట్‌ఫామ్ వైపు పరుగులు పెట్టారు.
Details
రాత్రి 10 గంటల సమయంలో ఘటన
ఈ సమయంలో 12, 13, 14 ప్లాట్‌ఫారాలు ఇప్పటికే ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దీనికి తోడు 16వ ప్లాట్‌ఫామ్ వైపు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది.
ప్రయాగ్‌రాజ్ వెళ్లే నాలుగు రైళ్లలో మూడు ఆలస్యమవడం కూడా ఈ గందరగోళానికి కారణమైంది. దీంతో చాలా మంది 14వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్దకు చేరుకుని పరిస్థితిని మరింత దిగజార్చారు.
ఘటనపై ఒక ప్రయాణికుడు స్పందిస్తూ తన జీవితంలో ఇంతమంది జనాన్ని ఒకే స్టేషన్‌లో చూడలేదని, అధికారులు అక్కడే ఉన్నా, ప్రయాణికుల సంఖ్యను నియంత్రించలేకపోయారని తెలిపారు.
ఈ తొక్కిసలాట రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.