Page Loader
Maharashtra: ఆన్‌లైన్ లో బెట్టింగ్ గేమ్ ఆడిన పూణే పోలీసు సస్పెండ్ 
Maharashtra: ఆన్‌లైన్ లో బెట్టింగ్ గేమ్ ఆడిన పూణే పోలీసు సస్పెండ్

Maharashtra: ఆన్‌లైన్ లో బెట్టింగ్ గేమ్ ఆడిన పూణే పోలీసు సస్పెండ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2023
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్11లో రూ.1.5 కోట్లు గెలుచుకుని మిలియనీర్‌గా మారిన పూణే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ పోలీసులు అతనిపై దుష్ప్రవర్తన,పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్, సోమనాథ్ ఝండే, ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ Dream11లో భారీ మొత్తాన్ని గెలుచుకున్నారు. అతను Dream 11 లో కోటిన్నర గెలిచిన వార్త దావానంలా వ్యాపించడంతో పోలీసు శాఖ అతనిపై చర్యలు తీసుకుంది. అతని మాట తీరు, ప్రవర్తన చూసిన తరువాత, పింప్రి-చించ్వాడ్ పోలీసులు ఈ విషయమై దర్యాప్తుకు ఆదేశించారు.

Details 

పోలీసు యూనిఫాం ధరించి మీడియాకు ఇంటర్వ్యూలు 

సోమనాథ్ అనుమతి లేకుండా ఆన్‌లైన్ గేమ్ ఆడాడని, పోలీసు యూనిఫాం ధరించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడని విచారణలో తేలింది. అనంతరం విధుల నుంచి సస్పెండ్‌ అయ్యారు. ఎస్సైపై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్,స్వప్నా గోర్ మాట్లాడుతూ అతను అనుమతి లేకుండా డ్రీమ్ 11 గేమ్ ఆడినట్లు తేలిందన్నారు. దాంతో అతనిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ ఇతర పోలీసు సిబ్బందికి గుణపాఠం అని అన్నారు. ఒక వేళ ఎవరైనా సిబ్బంది ఆన్‌లైన్ గేమ్‌లు ఆడితే, వారు కూడా క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. డిపార్ట్‌మెంటల్ ఇన్వెస్టిగేషన్‌లో సోమనాథ్ తన స్టేట్‌మెంట్‌ను సమర్పించనున్నట్లు పోలీసులు తెలిపారు.