Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
మృతురాలిని నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన లక్షితగా గుర్తించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు, లక్షిత తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు.
రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కొండపైకి వెళుతుండగా, తన కుటుంబ సభ్యుల కంటే ముందుగా నడుస్తున్న లక్షితపై చిరుతపులి దాడి చేసింది.
కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేస్తుండగా, ఆమెను అడవిలోకి లాక్కెల్లి చంపేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
తిరుమల
బాలిక మృతదేహాన్ని సగం తినేసిన చిరుత
బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అర్థరాత్రి కావడంతో వెంటనే బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టలేకపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం బాలిక కోసం వెతకగా, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే బాలిక మృతదేహాన్ని చిరుతపులి సగం తిన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవల దేశవ్యాప్తంగా చిరుతపులల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన సుశీల అనే ఆరేళ్ల బాలిక చిరుతపులి దాడిలో గాయపడి మృతి చెందింది.
హనూరు తాలూకాలోని కగ్గలిగుండి గ్రామానికి చెందిన బాలిక జూన్ 26న చిరుతపులి దాడిలో తీవ్రంగా గాయపడింది.