
MPs Salaries Hike: ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కీలక మార్పులు చేసింది. పార్లమెంట్ సభ్యుల నెల జీతాన్ని ప్రస్తుతం ఉన్న రూ.1,00,000 నుంచి రూ.1,24,000కి పెంచింది.
అలాగే, డైలీ అలవెన్సెస్‌ను రూ.2,000 నుంచి రూ.2,500కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మాజీ సభ్యుల పెన్షన్ విషయానికి వస్తే, ప్రస్తుతం వారికి నెలకు రూ.25,000 పెన్షన్ అందుతుండగా, దాన్ని రూ.31,000కి పెంచింది.
అదనపు పెన్షన్‌లోనూ మార్పులు చేస్తూ, రూ.2,000 నుంచి రూ. 2,500కి పెంచింది. ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.
Details
కర్ణాటకలో 100శాతం పెంపు
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం నెల జీతం రూ.1,00,000 ఉండగా, పెంపుతో అది రూ.2,00,000కి పెరిగింది. ఈ నిర్ణయం అసెంబ్లీలో చర్చకు దారి తీసింది.
ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా టికీ, ప్రభుత్వ నాయకులు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
ఈ విషయంలో కర్ణాటక హోం మినిస్టర్ జి. పరమేశ్వర స్పందిస్తూ, "సాధారణ ప్రజల ఖర్చులు పెరుగుతున్నట్లే ప్రజా ప్రతినిధుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.
ఓ ఎమ్మెల్యే కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతాడు. అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరూ బతకాలి కదా అని పేర్కొన్నారు.