Page Loader
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఎండ‌లు

రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2023
07:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు విపరీతంగా మండిపోతుండటంతో మధ్యాహ్నం పూట జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని ముత్తారంలో శుక్ర‌వారం అత్య‌ధికంగా 43.9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ నమోదయ్యింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధి గ‌చ్చిబౌలిలో అత్య‌ధికంగా 39 డిగ్రీల సెల్సియ‌స్ నమోదయ్యిందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది.

Details 

మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావ‌ర‌ణం 

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీ సెల్సియస్‌ అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38-40 డిగ్రీ సెల్సియస్‌ మధ్య నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దింతో రాబోయే మూడు రోజుల వ‌ర‌కు రాష్ట్రంలో పొడి వాతావ‌ర‌ణం ఏర్ప‌డే అవ‌కాశం ఉండనుంది. ఈ నెల 29 నుంచి 30వ తేదీ మ‌ధ్య రాష్ట్రంలో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.