India Deports: అక్రమ వలసదారులపై భారత్ ఉక్కుపాదం.. ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది విదేశీయులు
ఈ వార్తాకథనం ఏంటి
తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇది ఏ ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాదు. ఏ దేశ పౌరులైన అక్రమంగా ఉంటున్నారని గుర్తిస్తే చాలు, వారిని వారి స్వదేశాలకు పంపించడం అమెరికా ప్రభుత్వం అమలు చేస్తోంది.
అక్కడి అధికారులు ప్రత్యేకంగా వెతికి, అక్రమ వలసదారులను పట్టుకుని పంపుతున్నారు.
ఇప్పుడు అదే దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది.
భారత్‌లో అనధికారికంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో 16 మంది అక్రమ విదేశీ వలసదారులను గుర్తించింది.
వివరాలు
బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఐదు మంది
ఇప్పటికే, ఢిల్లీలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను భారత ప్రభుత్వం వెనక్కి పంపింది.
వీరి వీసా గడువు ముగిసిపోయింది, అయినా వారు ఇక్కడే ఉండటం గుర్తించడంతో చర్యలు తీసుకుంది.
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివసిస్తున్న 16 మందిని అధికారులు గుర్తించి వెనక్కి పంపించారు.
వీరిలో ఐదుగురు బంగ్లాదేశ్‌కు చెందిన వారు. ఇందులో ఓ కుటుంబం కూడా ఉంది, వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
అలాగే, తొమ్మిది మంది నైజీరియన్లు, ఒకరు గినియా దేశానికి చెందిన వారు, మరొకరు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు.
వీరందరినీ ముందుగా డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన అధికారులు, అనంతరం వారిని వారి స్వదేశాలకు పంపేశారు.