Page Loader
India-France: భారత్-ఫ్రాన్స్ భారీ ఒప్పందం.. రూ.63,000 కోట్లతో రాఫెల్-ఎం యుద్ధవిమానాలు!
భారత్-ఫ్రాన్స్ భారీ ఒప్పందం.. రూ.63,000 కోట్లతో రాఫెల్-ఎం యుద్ధవిమానాలు!

India-France: భారత్-ఫ్రాన్స్ భారీ ఒప్పందం.. రూ.63,000 కోట్లతో రాఫెల్-ఎం యుద్ధవిమానాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా ఫ్రాన్స్‌తో భారీ స్థాయిలో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద రూ.63,000 కోట్ల విలువైన 26 రాఫెల్ ఎమ్ (Rafale-M) యుద్ధవిమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ యుద్ధవిమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మెగా డీల్‌పై అధికారికంగా సంతకాలు త్వరలో జరగనున్నాయని సమాచారం. ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను ఈ నెల చివరిలో భారత్‌కు రానుండగా, ఆయన పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముందని వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 2023 జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ రాఫెల్ ఎమ్ యుద్ధవిమానాల కొనుగోలుకు ప్రాథమిక ఆమోదం తెలిపింది.

Details

37 నుంచి 65 నెలల వ్యవధిలో భారత్ కు డెలివరీ

రాఫెల్ ఎమ్ విమానాలు, దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఏయిర్‌క్రాఫ్ట్ కెరియర్‌తో కలసి పనిచేయనున్నాయి. ఒప్పందానికి సంబంధించిన శిప్మెంట్ 37 నుంచి 65 నెలల వ్యవధిలో భారత్‌కు డెలివరీ అయ్యే అవకాశం ఉంది. చైనా హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుతుండటంతో, భారత్ ఆ ప్రాంతంలో తన నావికా బలాన్ని పెంచే దిశగా పనిచేస్తోంది. సముద్ర సరిహద్దుల్లో పటిష్టమైన గస్తీ ఏర్పాటు చేయడంలో రాఫెల్ ఎమ్ విమానాలు కీలక పాత్ర పోషించనున్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి స్పష్టం చేశారు. దేశ భద్రతకు సంబంధించి కీలక ముందడుగుగా ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం అభివర్ణిస్తోంది.