IMD: అన్ డివైడెడ్ ఇండియా పేరుతో వేడుకలు.. హాజరుకానున్న పాక్, బంగ్లాదేశ్..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వసంతంలోకి ప్రవేశించింది. ఇది వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి మనకు ఎల్లప్పుడూ హెచ్చరికలు ఇచ్చే కీలక సంస్థ.
1875 జనవరి 15న ఐఎండీ స్థాపించబడింది. కానీ వాతావరణ అబ్జర్వేటరీలు ఐఎండీకి ముందే ఏర్పాటయ్యాయి.
మొదటి వాతావరణ అబ్జర్వేటరీలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించింది.
ఐఎండీ మొదట కలకత్తాలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది, కానీ 1905లో సిమ్లాకు, 1928లో పూణేకు, చివరికి 1944లో ఢిల్లీకి తరలించబడింది.
వివరాలు
ఐఎండీ 150 ఏళ్ల ఉత్సవాలకు పాక్, బంగ్లా
ఈ 150 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా ఐఎండీ "అన్ డివైడెడ్ ఇండియా" కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
దీనిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను కూడా ఆహ్వానించింది. సెమినార్‌లో పాల్గొనడానికి పాక్, బంగ్లాతో పాటు భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌లకు కూడా ఆహ్వానాలు పంపబడ్డాయి.
పాకిస్తాన్ ఇప్పటికే పాల్గొనడానికి అంగీకారం తెలిపింది, కానీ బంగ్లాదేశ్ నుండి ఇంకా స్పష్టత రాలేదు.
బంగ్లాదేశ్ కూడా హాజరైతే, ఇది చారిత్రాత్మక సంఘటన అవుతుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూ.150 స్మారక నాణేాన్ని విడుదల చేయగా, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక శకటానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.