NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ
    భారతదేశం

    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ

    వ్రాసిన వారు Naveen Stalin
    April 19, 2023 | 02:30 pm 1 నిమి చదవండి
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ

    భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్‌పీఏ) తాజా డేటా ప్రకారం చైనాలో కంటే భారత్‌లో 2.9 మిలియన్ల మంది ఎక్కువ జనాభా ఉన్నారు. '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైట్స్ అండ్ ఛాయిసెస్' పేరుతో ప్రపంచ జనాభా రిపోర్టు- 2023ను యూఎన్ఎఫ్‌పీఏ బుధవారం విడుదల చేసింది. భారతదేశ జనాభా 1,428.6 మిలియన్లు కాగా, చైనా జనాభా 1,425.7 మిలియన్లుగా ఉన్నట్లు యూఎన్ఎఫ్‌పీఏ పేర్కొంది. ఇరు దేశాల మధ్య 2.9 మిలియన్ల తేడాతో ఉన్నట్లు వెల్లడించింది. 1950నుంచి ఐక్యరాజ్య సమితి జనాభా డేటాను సేకరించి విడుదల చేస్తోంది. ఇన్నేళ్లలో జనాభాలో చైనాను భారత్ అధిగమించడం ఇదే మొదటిసారి.

    ఆయుర్దాయం విషయంలో భారతదేశం కంటే చైనా భేష్

    చైనా జనాభా ఈ ఏడాది నుంచి క్షీణించడం ప్రారంభించిందని యూఎన్ఎఫ్‌పీఏ మీడియా, సంక్షోభ కమ్యూనికేషన్ల సలహాదారు అన్నా జెఫెరీస్ అన్నారు. భారతదేశ జనాభా పెరుగుతున్నప్పటికీ దాని జనాభా పెరుగుదల రేటు 1980నుంచి తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. యూఎన్ఎఫ్‌పీఏ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో 25%మంది 0-14ఏళ్ల మధ్య వయస్సు వారు, 18%మంది 10-19మధ్య, 26% మంది 10-24మధ్య, 68%మంది 15-64మధ్య, 7%మంది 65ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. కానీ చైనాలో 65ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు దాదాపు 200మిలియన్ల మంది ఉండటం గమనార్హం. ఆయుర్దాయం విషయంలో భారతదేశం కంటే చైనా మెరుగ్గా ఉంది. ఇది మహిళల విషయంలో పురుషుల కంటే 82:76గా ఉంది. భారతదేశానికి సంబంధించిన గణాంకాలు 74:71గా ఉన్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    భారతదేశం
    చైనా
    ఐక్యరాజ్య సమితి
    తాజా వార్తలు

    భారతదేశం

    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? మిజోరం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    UPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు బ్యాంక్
    అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ  ఉక్రెయిన్

    చైనా

    సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు  వాషింగ్టన్ పోస్ట్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  భారతదేశం
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ ఐఎంఎఫ్

    ఐక్యరాజ్య సమితి

    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే' ప్రపంచం
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్
    భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ కైలాసం
    హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి హైదరాబాద్

    తాజా వార్తలు

    యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు ఆంధ్రప్రదేశ్
    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి వేసవి కాలం
    దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్  కరోనా కొత్త కేసులు
    మార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్  ఎయిర్ ఇండియా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023