Loading...
Nitin Gadkari: ఆరోగ్యమే నిజమైన సంపద.. 135 కిలోల నుంచి 89 కిలోలకు గడ్కరీ ఎలా తగ్గారంటే?
ఆరోగ్యమే నిజమైన సంపద.. 135 కిలోల నుంచి 89 కిలోలకు గడ్కరీ ఎలా తగ్గారంటే?

Nitin Gadkari: ఆరోగ్యమే నిజమైన సంపద.. 135 కిలోల నుంచి 89 కిలోలకు గడ్కరీ ఎలా తగ్గారంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు సుమారు 135కిలోల బరువు ఉన్న తాను.. ఇప్పుడు 89కిలోలకు చేరుకున్నట్లు తెలిపారు. అంటే దాదాపు 46కిలోల బరువు తగ్గారు. ఇందుకు ప్రధాన కారణం రోజువారీ వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలేనని చెప్పారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ నిర్వహించే యూట్యూబ్ ఛానల్‌లో జరిగిన ఇంటర్వ్యూలో గడ్కరీ తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించారు. గతంలో తన జీవనశైలి చాలా అస్తవ్యస్తంగా ఉండేదని, ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకుండా రోజులు గడిచేవని ఆయన అంగీకరించారు. అయితే కరోనా మహమ్మారి తన జీవితంలో కీలకమైన మార్పుకు కారణమైందని చెప్పారు.

వివరాలు 

కరోనా తర్వాత ఆరోగ్యంపై దృష్టి

"కరోనా సమయంలో నాకు సన్నిహితంగా ఉన్న కొందరు స్నేహితులు కన్నుమూశారు. ఆ ఘటనలు నన్ను తీవ్రంగా ఆలోచించేలా చేశాయి. అప్పుడే నా జీవనశైలిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆరోగ్యమే నిజమైన సంపద అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను" అని గడ్కరీ గుర్తుచేసుకున్నారు.

మహమ్మారి అనంతరం తన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని గడ్కరీ తెలిపారు.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా రోజువారీ దినచర్యలో వ్యాయామానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.

ఈ మార్పు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే పరిమితం కాలేదని.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడమే తన లక్ష్యమని వివరించారు.

వివరాలు 

ప్రతిరోజూ కఠినమైన వ్యాయామం

తన ప్రస్తుత దినచర్య గురించి కూడా గడ్కరీ వివరించారు. అధికారిక పనుల కారణంగా కొన్ని సందర్భాల్లో రాత్రి 1 గంటకు నిద్రపోయినా.. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు నిద్రలేస్తానని చెప్పారు.

ఆ తర్వాత సుమారు రెండు నుంచి రెండున్నర గంటల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

కేవలం అందం కోసం కాదు..

తాను బరువు తగ్గడానికి కేవలం శారీరక రూపాన్ని మార్చుకోవాలనే ఉద్దేశం లేదని గడ్కరీ స్పష్టం చేశారు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన జీవనశైలి మార్పు అని పేర్కొన్నారు.

క్రమబద్ధమైన దినచర్యను పాటించడం వల్ల తనలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కొనసాగిస్తూ 135 కిలోల నుంచి 89 కిలోలకు చేరుకోవడం తనకు ఎంతో మార్పును తీసుకొచ్చిందని గడ్కరీ వివరించారు.

ఆరోగ్యంపై దృష్టి పెట్టి, నిత్య జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వచ్చిన ఈ మార్పు.. తన పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఆయన వెయిట్ లాస్ జర్నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనుకునే పలువురికి స్ఫూర్తిగా మారుతోంది.

ADVERTISEMENT