
Defence purchases withUS: ఆయుధ కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవం.. స్పష్టం చేసిన రక్షణ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ -అమెరికా ఆయుధాలు,యుద్ధ విమానాల కొనుగోళ్లపై చర్చలు నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై రక్షణ శాఖ స్పందించింది. "ప్రస్తుత నిబంధనల ప్రకారం కొనుగోలు చర్యలు నడుస్తున్నాయని" రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ అంశంపై 'రాయిటర్స్' ప్రచురించిన వార్తా కథనాన్ని తోసిపుచ్చింది. ఆ వార్తలో ముగ్గురు భారత అధికారులను ఉంటంకిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఎగుమతులపై విధించిన భారీ పన్నులపై భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అమెరికా ఆయుధాలు,విమానాలు కొనుగోళ్లపై తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాయిటర్స్ పేర్కొంది.
వివరాలు
మొత్తం ఒప్పందం సుమారు 3.6 బిలియన్ డాలర్లు
ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి త్వరలో అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తన పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. అమెరికా నుంచి ఆయుధాలు,యుద్ధ విమానాల మొత్తం ఒప్పందం సుమారు 3.6 బిలియన్ డాలర్లు. డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న, రష్యా నుండి భారతదేశం కొనుగోలు చేస్తున్న చమురుపై అదనంగా 25% పన్ను విధించి,మొత్తం పన్నులను 50%కి పెంచారు,ఇది యుఎస్ వాణిజ్య భాగస్వాములలో అత్యధిక పన్నులలో ఒకటిగా ఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు అయిన భారతదేశం అంతకముందు రష్యా నుంచి ఆయుధాలు కొన్నప్పటికీ, ఇటీవల ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యుఎస్ వంటి ఇతర సరఫరాదారుల వైపు మళ్లింది .