Deeply Troubling: యూఎస్‌ఎయిడ్‌పై భారత్ ఆందోళన.. సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ భారతదేశంలో ఓటింగ్‌ను ప్రభావితం చేసేందుకు రూ.182 కోట్ల నిధులను కేటాయించారని ట్రంప్ ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, యూఎస్‌ఎయిడ్ (USAID) ఎన్నికలపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించిందనే వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది.
ఈ వ్యవహారంపై సంబంధిత అధికార విభాగాలు దృష్టి సారించాయి అని వెల్లడించింది.
వివరాలు
స్పందించిన రణ్‌ధీర్ జైశ్వాల్
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, "యూఎస్ నిధులు, కార్యకలాపాలకు సంబంధించి అమెరికా అధికార యంత్రాంగం వెల్లడించిన వివరాలను పరిశీలిస్తున్నాం. ఇవి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత దశలో దీనిపై తక్షణ నిర్ణయం ప్రకటించడం తొందరపాటు అవుతుంది. సంబంధిత అధికారుల నుండి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని అన్నారు.
వివరాలు
బైడెన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా..
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా విదేశాంగ సహాయ నిధులను పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా యూఎస్‌ఎయిడ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు యూఎస్‌ఎయిడ్ 21 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అని ఆయన తెలిపారు.
"ఇది ఎవరో ఒకరిని గెలిపించేందుకు బైడెన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని భారత్‌కు తెలియజేయాల్సిన అవసరం ఉంది," అని ట్రంప్ పేర్కొన్నారు.