Page Loader
'గగన్‌యాన్' పైలెట్లకు శిక్షణ పూర్తికావొచ్చింది: రాకేష్ శర్మ 
'గగన్‌యాన్' మిషన్‌పై భారత తొలి వ్యోమగామి రాకేష్ శర్మ కామెంట్స్

'గగన్‌యాన్' పైలెట్లకు శిక్షణ పూర్తికావొచ్చింది: రాకేష్ శర్మ 

వ్రాసిన వారు Stalin
Apr 27, 2023
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత తొలి వ్యోమగామి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) రాకేష్ శర్మ ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 'గగన్‌యాన్' & బియాండ్'పై ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంతరిక్ష కేంద్రంలో పనిచేసిన అనుభవాన్ని ఓయూ విద్యార్థులు, అధ్యాపకులతో పంచుకున్నారు. అనంతరం రాకేష్ శర్మ మీడియాతో మాట్లాడారు. గగన్‌యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గగన్‌యాన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు రాకేష్ శర్మ పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు పైలెట్లకు ఇస్రో అవసరమైన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వారు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులకు అనుగూణంగా వారిని ఇస్రో సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వారి శిక్షణ దాదాపు పూర్తికొవ్చచ్చిందని చెప్పారు.

గగన్ యాన్

భారత సాంకేతికత శక్తిని ప్రపంచానికి చాటేందుకే గగన్‌యాన్: రాకేష్ శర్మ

అలాగే స్పేస్ టూరిజంపై కూడా రాకేష్ శర్మ మాట్లాడారు. కొన్ని విదేశీ సంస్థలు స్పేస్ టూరిజం పేరుతో మానవులను అంతరిక్షంలోకి పంపుతున్నాయని రాకేష్ శర్మ చెప్పారు. కానీ ఇస్రో మాత్రం సమాజ హితం కోసమే పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలకు ధీటుగా భారత్‌ కూడా అంతరిక్షంలోకి పైలెట్లను పంపే పరిజ్ఞానం ఉందని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇస్రో గగన్‌యాన్ మిషన్‌ను చేపడుతున్నట్లు రాకేష్ శర్మ చెప్పారు. అంతరిక్ష పరిశోధనను ఎంచుకున్న విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఫిజిక్స్ చదవుతున్న 15శాతం మంది విద్యార్థులు ఆస్ట్రో ఫిజక్స్‌ను ఎంచుకోవడం శుభపరిణామం అన్నారు.