LOADING...
PM Modi: 'ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ 7.8% వృద్ధి': సుంకాలపై ప్రధాని మోదీ
'ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ 7.8% వృద్ధి': సుంకాలపై ప్రధాని మోదీ

PM Modi: 'ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ 7.8% వృద్ధి': సుంకాలపై ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా విధిస్తున్న సుంకాల (టారిఫ్స్)ను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల ఆర్థిక స్వార్థాల కారణంగా ఎదురైన సవాళ్లన్నీ ఉన్నప్పటికీ, భారత్‌ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని అయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి ప్రభావవంతంగా రాణిస్తోంది అని ఆయన తెలిపారు. దిల్లీ బశోభూమిలో జరిగిన సెమీకాన్‌ ఇండియా 2025 సదస్సులో ప్రసంగిస్తూ, ప్రపంచ స్థాయిలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌ స్థిరంగా అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఆయన ప్రపంచంలోని వివిధ కంపెనీలను "మేకిన్‌ ఇండియా" కోసం భారత్‌కి రావాలని, ఇక్కడే ప్రపంచానికి అవసరమైన తయారీలు జరగాలని ఆహ్వానించారు.

వివరాలు 

త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ

తమ పాలనలో భారతదేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత వంటి మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని చెప్పారు. అందువల్ల, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్‌ .. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్నదని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.