India-Pakistan: 'రక్తంతో తడిసిన దేశం': పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చిన భారత్
జెనీవా వేదికగా ఐక్యరాజ్యసమితి 55వ మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఇటీవల ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని టర్కీ,పాకిస్థాన్ లు లేవనెత్తాయి. మానవ హక్కుల అణచివేత జరుగుతోందని నోరుపారేసుకున్నాయి. ఈ ఆరోపణలకు భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్ తన 'ప్రత్యుత్తర హక్కు'ని వినియోగించుకుంది. UN మానవ హక్కుల మండలిలో భారతదేశం మొదటి కార్యదర్శి, అనుపమ సింగ్, పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. మానవ హక్కులపై దేశం స్వంత ట్రాక్ రికార్డ్‌లను ప్రస్తావించారు. దీనిని "నిజంగా అధ్వాన్నంగా" అభివర్ణించారు. జమ్ముకశ్మీర్ భారతదేశం "అంతర్గత విషయం" అని సింగ్ పేపేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ సమస్యపై ఇటువంటి "అయాచిత వ్యాఖ్యలు" మానుకోవాలన్నారు.
పాకిస్తాన్ లో మైనార్టీలపై దాడులు
గత ఏడాది ఆగస్టులో, పాకిస్తాన్ జరన్‌వాలా నగరంలో మైనార్టీలపై జరిగిన దారుణమైన దాడులలో 19 చర్చీలను తగలబెట్టారని, 89 క్రిస్టియన్ నివాసాలను కాల్చివేశారన్నారు. అలాంటి వారు మానవహక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు. ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో పాక్ తడిసిపోయింది. పాక్ ప్రస్తుతం కరెన్సీ అధిక తరుగుదల, ద్రవ్యోల్బణం మరియు ఫారెక్స్ నిల్వలు తగ్గడం వంటి వివిధ ఆర్థిక సమస్యలతో పోరాడుతోంది. అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు'' అని దాయాదిని కడిగిపారేశారు.