
భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశానికి సౌదీ అరేబియా అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటన్నారు.
శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని మోదీ పేర్కొన్నారు.
ఈ చర్చల సందర్భంగా, తమ భాగస్వామ్యాన్ని మరింత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇందుకోసం కీలక అంశాలను గుర్తించామన్నారు. ఈ అంశాలు ఇరు దేశాల మధ్య సంబంధాలకు కొత్త శక్తిని, దిశను అందిస్తాయని మోదీ అన్నారు.
అంతేకాకుండా మానవాళి సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తాయని వివరించారు.
details
రెండు దేశాల ఆర్థికాభివృద్ధికి ఎకనామిక్ కారిడార్ దోహదం: మోదీ
భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ గురించి కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇది రెండు దేశాలను అనుసంధానించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని అందించడంలో దోహదపడుతుందన్నారు.
ఆసియా, పశ్చిమాసియా, యూరప్ మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.
యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియా అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని వివరించారు.
దిల్లీలో జీ20 సదస్సు ముగిసిన ఒక రోజు తర్వాత ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
అంతకుముందు సౌదీ అరేబియా యువరాజుకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది రెడ్ కార్పెట్‌పై స్వాగతం పలికారు.
details
భారత్‌కు అభినందనలు: సౌదీ యువరాజు
ఇంధనం, వ్యవసాయం, రాజకీయ, భద్రత, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లోని విభిన్న అంశాలపై మోదీ- సౌదీ యువరాజు చర్చించారు.
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. భారత్‌లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
జీ20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు భారతదేశాన్ని ఆయన అభినందించారు.
జీ20 దేశాలు, ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే అనేక ప్రకటనలు దిల్లీ వేదికగా వెలువడినట్లు మహ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు.
రెండు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం తాము కలిసి పని చేస్తామని ఆయన వివరించారు.