NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లో మహిళలపై దాడులు, మణిపూర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో సోమవారం పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట అధికార 'ఎన్డీఏ', ప్రతిపక్ష 'ఇండియా' పోటాపోటీగా నిరనసకు దిగాయి.
రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా, రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్‌డీఎకు ఎంపీలు ఆందోళనకు దిగాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో, విపక్షాల కూటమికి చెందిన 'ఇండియా' ఎంపీలు కూడా గాంధీ విగ్రహం ముందు గుమిగూడారు.
మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని మోదీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్
బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: ప్రతిపక్షాలు
మణిపూర్‌లో జాతి ఘర్షణలను నిలువరించడంలో సీఎం ఎన్.బీరెన్ సింగ్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అందుకో సీఎం ఎన్.బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు.
మణిపూర్ అల్లర్లపై చర్చించాలని, ఉభయ సభల్లో దీనిపై స్పందించాలని లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ మూడో రోజు కూడా ప్రతిపక్ష ఎంపీలు వాయిదా నోటీసులు సమర్పించారు.
మణిపూర్ హింసాకాండపై నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీల్లో జేడీయూకి చెందిన రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, టీఎంసీకి చెందిన మహువా మాంజీ, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, కాంగ్రెస్‌కు చెందిన రంజిత్ రంజన్, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే ఉన్నారు.