
#NewsBytesExplainer: భారతదేశం vs పాకిస్తాన్ సైనిక బలం: సైన్యం, నౌకాదళం, వైమానిక దళం వివరణాత్మక విశ్లేషణ
ఈ వార్తాకథనం ఏంటి
డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేందుకు మిలిటరీ వాహనాలు డీజిల్ పొయ్యలేరు కానీ.. ఫైటర్ జెట్ల ట్రయల్ రన్ తీయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే, కానీ అది చేతకాదు.
యుద్ధ ట్రయాంకర్లకు ఆయుధాలు, వాహనాలను ఫిక్స్ చెయ్యడానికి బోల్టులు కూడా కరువే. అదే కాదు, సైనికుల కోసం కొత్త యూనిఫారములు, బూట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేనంత దారుణంగా రోజులీడుస్తున్నారు.
వివరాలు
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక బలాలు.. బలగాల మధ్య ఉన్న వ్యత్యాసం
భారత్ గోధుమపిండి ఇస్తే తప్ప, పాకిస్థాన్ ప్రజలు మూడు పూటలు గడపడం కష్టం. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్‌కు సవాలు విసురుతోంది.
అంతర్జాతీయంగా, భారత్ గౌరవం, మార్కెట్ వాల్యూ, సైనిక శక్తి, ఆర్థిక సంపద పోలిస్తే పాకిస్తాన్ చాలా చిన్నది.
అయినప్పటికీ, అక్కడి సైనిక పాలకులు దేశాన్ని కాపాడుకునేందుకు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక బలాలు.. బలగాల మధ్య ఉన్న వ్యత్యాసం ఎలా ఉందో చూద్దాం.
వివరాలు
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఇరు దేశాల మిలిటరీ శక్తి ఎలా ఉందంటే..
మిలిటరీ ర్యాంకింగ్:
భారతదేశం: ప్రపంచంలో 4వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.1184
పాకిస్తాన్: ప్రపంచంలో 12వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.2513
మానవ వనరులు:
మొత్తం జనాభా: భారతదేశం - 1.4 బిలియన్
పాకిస్తాన్ - 252 మిలియన్
యాక్టివ్ సైన్యం:
భారతదేశం - 14,55,550
పాకిస్తాన్ - 6,54,000
వివరాలు
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఇరు దేశాల మిలిటరీ శక్తి ఎలా ఉందంటే..
రిజర్వ్ సిబ్బంది:
భారతదేశం - 11,55,000
పాకిస్తాన్ - 5,50,000
పారా మిలిటరీ దళాలు:
భారతదేశం - 25,27,000
పాకిస్తాన్ - 5,00,000
వాయుసేన శక్తి: మొత్తం విమానాలు:
భారతదేశం - 2,229
పాకిస్తాన్ - 1,399
యుద్ధ విమానాలు:
భారతదేశం - 513
పాకిస్తాన్ - 328
ఎటాక్ హెలికాఫ్టర్లు:
భారతదేశం - 80
పాకిస్తాన్ - 57
భూసైనిక శక్తి: ట్యాంకులు:
భారతదేశం - 4,201
పాకిస్తాన్ - 2,627
వివరాలు
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఇరు దేశాల మిలిటరీ శక్తి ఎలా ఉందంటే..
ఆర్మర్డ్ వెహికల్స్:
భారతదేశం - 1,48,594
పాకిస్తాన్ - 17,516
మొబైల్ రాకెట్ వ్యవస్థలు:
భారతదేశం - 264
పాకిస్తాన్ - 600
నావికాబలం: మొత్తం నేవీ స్థావరాలు:
భారతదేశం - 293
పాకిస్తాన్ - 121
ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు:
భారతదేశం - 2
పాకిస్తాన్ - 0
జలాంతర్గాములు:
భారతదేశం - 18
పాకిస్తాన్ - 8
డిస్ట్రాయర్స్:
భారతదేశం - 13
పాకిస్తాన్ - 0
రక్షణ ఖర్చు:
భారతదేశం: $75 బిలియన్
పాకిస్తాన్: $7.64 బిలియన్
వివరాలు
చేతులెత్తేసి..మోకాళ్ళమీద నిలబడి..
ఈ వివరాలను చూశాకా, ఇప్పుడు ఎవరి సైనిక శక్తి పెద్దది, ఎవరి శక్తి చిన్నది అనేది స్పష్టంగా తెలుస్తోంది.
గతంలో పాకిస్తాన్ భారత్‌పై యుద్ధం ప్రకటించి, అప్పటికప్పుడు చేతులెత్తేసి..మోకాళ్ళమీద నిలబడి శరణు వేడిన సందర్భాలు ఉన్నాయ్.
ఇప్పుడు అదే సైనిక శక్తిని ప్రదర్శించి పాక్ మరోసారి భారతదేశంతో తలపడేందుకు సిద్ధం అయింది.
అయితే, భారత్ సేన ఒక అడుగు ముందుకు వేయగానే, పాకిస్తాన్ దానికి సమాధానం ఇవ్వలేక పోతుంది.
భారత్ ప్రభుత్వం కూడా దానిని ఖచ్చితంగా స్పష్టం చేసింది.