
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.దీనితో రగిలిపోయిన పాకిస్థాన్.. ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో భారత ఆర్మీ శిబిరాలు, సామాన్య ప్రజల నివాసాలే లక్ష్యంగా దాడులకు దిగింది. వందల సంఖ్యలో డ్రోన్లు,క్షిపణులను భారత్‌పై ప్రయోగించింది. అయితే, మన దేశ గగనతల రక్షణ వ్యవస్థలు.. ముఖ్యంగా ఎస్-400, ఆకాశ్ వంటి అధునాతన సాంకేతిక పరికరాలు.. అద్భుతంగా స్పందించాయి. పాక్ నుండి వచ్చిన డ్రోన్లు, మిస్సైల్స్ అన్నింటినీ గాలిలోనే ధ్వంసం చేశాయి.
వివరాలు
పాక్‌పై భారత సైన్యం చేసిన పలు దాడులకు సంబంధించిన వీడియోల విడుదల
దాంతో, పాక్ ప్రయోగించిన ఆయుధాల శకలాలు వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మన దేశ రక్షణ వ్యవస్థలు గోడలా పని చేస్తూ, వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇక ఇప్పటికే పాక్‌పై భారత సైన్యం చేసిన పలు దాడులకు సంబంధించిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. తాజాగా పాక్ క్షిపణులను ఎలా సమర్థంగా కూల్చేశారో వివరిస్తూ, వెస్ట్రన్ కమాండ్ తమ ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్టు చేసింది. అందులో భారత సైన్యం అగ్ని గోడలా పని చేస్తూ పాకిస్థాన్ నుంచి వచ్చిన మిస్సైల్స్‌ను సజీవంగా కూల్చిన దృశ్యాలు కనిపించాయి. శత్రుదేశపు దాడులపై ఎలా ధీటుగా తిప్పి కొట్టాలో ఈ ఆపరేషన్ స్పష్టంగా చూపించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వెస్ట్రన్ కమాండ్ చేసిన ట్వీట్
#StrongAndCapable#OpSindoor
— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025
Enemy Missiles neutralised... #IndianArmy - impregnable wall of fire#JusticeServed@adgpi@prodefencechan1 pic.twitter.com/siLM09smTe