ప్రపంచ ఖరీదైన 25నగరాల జాబితాలో భారతదేశ నగరానికి దక్కిన స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
జూలియస్ బేయర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో భారతదేశ నగరం ముంబైకి చోటు దక్కింది.
ఈ ఇండెక్స్ లో ప్రాపర్టీ, కార్లు, బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్, బిజినెస్ స్కూల్, ఇతర విలాసాలను విశ్లేషించి ప్రపంచంలోని 25నగరాల జాబితాను తయారు చేసింది.
ఈ ఇండెక్స్ లో ఆసియా ఖండంలోని నగరాలకు వరుసగా 4వ సారి మొదటి స్థానం దక్కింది. గతేడాది ముంబై 24వ స్థానంలో ఉండేది. ఈ ఏడాది 6స్థానాలు మెరుగుపరుచుకుని 18స్థానానికి ఎగబాకింది.
వరుసగా నాలుగవ సారి మొదటి ర్యాంకు పొందిన ఆసియా ఖండంలోని నగరాల్లో, అన్ని ఇండెక్స్ వస్తువులకు స్థానిక కరెన్సీలో 13శాతం ధరలు పెరిగాయి.
Details
మొదటి స్థానంలో సింగపూర్
ఆసియా ప్రాంతంలో, హోటల్ సూట్స్(39.1%), బిజినెస్ క్లాస్ ఫ్లైట్లు(32.9%), కార్లు(25.2%) అత్యధిక ధరల పెరుగుదలను నమోదు చేసాయి. అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్ మొదటి స్థానం దక్కించుకుంది.
గతేడాది షాంఘై(హాంకాంగ్), ఈ ఏడాది రెండవ స్థానానికి పడిపోయింది. షాంఘైలో స్థానిక కరెన్సీలో కేవలం 3%మాత్రమే ధరలు పెరిగాయి.
ఈ లిస్టులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాలుగా గుర్తింపు తెచ్చుకున్న టోక్యో, సిడ్నీ నగరాలు తమ ర్యాంకులు దిగజార్చుకున్నాయి.
విచిత్రంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన బ్యాంకాక్, జకర్తా, ముంబై వంటి దేశాలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నాయి.