Page Loader
బిపోర్‌జాయ్‌ తుపాను ఎఫెక్ట్: 50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

బిపోర్‌జాయ్‌ తుపాను ఎఫెక్ట్: 50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 13, 2023
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిపోర్‌జాయ్‌ తుపానుతో అరేబియా సముద్రం కల్లోలంగా మారిన నేపథ్యంలో ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది సాహాసం చేశారు. ఈ మేరకు స్పెషల్ ఆపరేషన్‌ ప్రక్రియతో దాదాపు 50 మందిని రక్షించారు. అరేబియా నుంచి బిపోర్‌ జాయ్‌ తుపాను ముప్పు ముంచుకొస్తున్న వేళ గుజరాత్‌ తీరంలో అధికారులు ముందస్తు చర్యలను ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగానే ద్వారక తీరంలోని ఓ ఆయిల్‌ రిగ్‌ లో పనిచేస్తున్న సుమారు 50 మంది సిబ్బందిని కోస్ట్‌ గార్డ్‌ కాపాడింది. అనంతరం సేఫ్ జోన్ కు తరలించింది. ప్రతికూల వాతావరణంలోనూ సాహాసాలతో తీర ప్రాంత రక్షక దళం ఈ రెస్క్యూ ఆపరేషన్‌ ను విజయవంతం చేసింది.

DETAILS

బలమైన గాలులు వీస్తున్నా హెలికాప్టర్‌ తో సహాయక చర్యలు

ద్వారకలోని ఓఖా తీరానికి 40 కిమీల దూరంలో కీ సింగపూర్‌ ఆయిల్‌ రిగ్‌ ఉంది. బిపోర్‌ జాయ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది రక్షణకు తీర ప్రాంత రక్షక దళం అప్రమత్తంగా వ్యవహరించింది. శూర్‌ వాహక నౌక, తేలిక పాటి హెలికాప్టర్‌ ఎంకే - 3 సాయంతో నిన్న 26 మందిని, మంగళవారం 24 మందిని కాపాడినట్లు భారత తీరప్రాంత రక్షక దళం వెల్లడించింది. రాత్రంతా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి వీరిని కాపాడగలిగామన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కోస్ట్‌ గార్డ్‌ తమ ట్విట్టర్‌ అకౌంట్ లో పోస్ట్ చేసింది. బలమైన గాలులు వీస్తున్నా చాకచక్యంతో శూర్‌ నౌకపై హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేసి సిబ్బందిని రక్షించడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సాహసోపేతమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ భద్రతా చర్యలు