
సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ దాడులను అరికట్టేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
సైబర్ నేరం, మాల్వేర్ దాడులను నిరోధించేందుకు మైక్రోసాఫ్ట్ ఓఎస్ స్థానంలో తమ కంప్యూటర్లన్నింటిలో ఆపరేటింగ్ సిస్టమ్ 'మాయ'ను అప్డేట్ చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆపరేటింగ్ సిస్టమ్ 'మాయ'ను ఓపెన్ సోర్స్ ఉబుంటు ఆధారంగా తయారు చేసినట్లు వెల్లడించింది.
డిఫెన్స్‌పై సైబర్‌టాక్‌లు పెరగడతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
ఓఎస్ 'మాయ'లో ఇంటర్‌ఫేస్, విండోస్ వంటివి కూడా ఉన్నట్లు మాయ రూపకల్పనలో పాల్గొన్న అధికారి వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ ఓఎస్‌కు మాయకు పెద్ద తేడా ఏమీ ఉండదని ఆయన చెప్పారు.
రక్షణ శాఖ
ఆరు నెలల్లోనే 'మాయ' అభివృద్ధి
సౌత్ బ్లాక్‌లోని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసిన అన్ని కంప్యూటర్లలో ఆగస్ట్ 15లోపు మాయను ఇన్‌స్టాల్ చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది.
ఎండ్ పాయింట్ డిటెక్షన్, ప్రొటెక్షన్ సిస్టమ్‌ను పొందడానికి కంప్యూటర్లలో చక్రవ్యూహాన్ని కూడా ఇన్‌స్టాల్ చేయనున్నారు.
ఓఎస్ మాయ అనేది కేవలం రక్షణ మంత్రిత్వ శాఖ కంప్యూటర్లలో మాత్రమే ఇన్‌స్టాల్ చేయనున్నారు. మిగతా వాటిలో ఓఎస్ మాయను వినియోగించరు.
అయితే రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తున్న నేవీ, ఆర్మీ, వైమానిక దళాలకు చెందిన కంప్యూటర్లలో త్వరలోనే ఓఎల్ మాయను ఇన్‌స్టాల్ చేయనున్నారు.
ప్రభుత్వ ఏజెన్సీలు ఆరు నెలల్లోనే ఆపరేటింగ్ సిస్టమ్ 'మాయ'ను అభివృద్ధి చేశాయి.