
Indian fisherman: పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ (Pakistan) జైల్లో మగ్గిపోతున్న భారత మత్స్యకారుడు (Indian fisherman) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లో తాడుతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ వెల్లడించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. భారత్-పాకిస్థాన్ జల సరిహద్దులపై అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లి పట్టుబడినవారు చాలా మందే ఉన్నారు.
అలానే 2022లో గౌరవ్‌రామ్ ఆనంద్ (52) అనే భారత మత్స్యకారుడు పాక్ అధికారులకు చిక్కి, అరెస్టయ్యాడు. అప్పటి నుంచి కరాచీలోని మాలిర్ జైల్లో మగ్గిపోతున్నాడు.
అయితే మంగళవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన అతడు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Details
పాక్ పై తీవ్ర విమర్శలు
ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానించిన జైలు సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అతడు మరణించాడని తెలిపారు. మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచినట్లు పాక్ అధికారులు తెలిపారు.
చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక అతడి మృతదేహాన్ని భారత్‌కు అప్పగించనున్నారు. గత నెలలో పాక్ ప్రభుత్వం తమ జైల్లో ఉన్న 22 మంది భారత మత్స్యకారులను శిక్షాకాలం పూర్తికావడంతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో 266 మంది భారత ఖైదీలు ఉండగా, భారత్ జైళ్లలో 462 మంది పాక్ ఖైదీలు ఉన్నారు. తాజా ఘటన రెండు దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.