Elon Musk: ఎలాన్ మస్క్ కి కేంద్రం నుండి 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు'
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X నుండి ,కొన్ని నిర్దిష్ట ఖాతాలు, పోస్టులపై, చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని గురువారం తెలిపింది. అయితే ప్లాట్‌ఫారమ్ ఆ ఆదేశాలతో విభేదిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి చర్యలతో తాము విభేదిస్తున్నామని X పేర్కొంది. తమ వేదికపై ప్రతిఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని X పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ రిట్ అప్పీలు దాఖలు చేసినట్లు X తెలిపింది. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. చట్టపరమైన పరిమితుల కారణంగా, కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రచురించలేకపోయామని X తెలిపింది.
పారదర్శకత కోసం వాటిని బహిరంగపరచడం చాలా అవసరం
చట్టపరమైన పరిమితుల కారణంగా, ప్రభుత్వ ఆదేశాలను బయటపెట్టలేకపోతున్నామని తెలిపింది. అయినప్పటికీ, "పారదర్శకత కోసం వాటిని బహిరంగపరచడం చాలా అవసరం" అని నమ్ముతున్నట్లు పేర్కొంది. లేదంటే జవాబుదారీతనం లోపిస్తుందని.. ఏకపక్ష నిర్ణయాలకు దారితీస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. "మేము మా విధానాలకు అనుగుణంగా ప్రభావితమైన యూజర్లకు నోటీసును అందించాము" అని పేర్కొంది.దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలకు సంబంధించిన దాదాపు 177 ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఎక్స్‌ను ఆదేశించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.