
Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం సందర్భంగా, భారత ప్రభుత్వం అన్ని భద్రతా దళాలకు పూర్తి స్వేచ్చను ఇచ్చింది.
ఈ కారణంగా, భారత నౌకాదళం కూడా పాకిస్థాన్ పై దాడులు చేపడుతోంది.
ప్రస్తుతం అరేబియా సముద్రంలో మోహరించిన భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్థాన్ ప్రధాన నౌకాస్థావరమైన కరాచీపై సుదీర్ఘంగా దాడులు చేస్తోంది.
కరాచీ నౌకాశ్రయంతో పాటు, నగరంపై కూడా దాడులు జరుగుతున్నాయి.
వివరాలు
పాక్ యుద్ధ నౌకల్లోని సైనికులు నీళ్లలో దూకి తప్పించుకున్నారు
ఇదిలా ఉంటే , 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో, భారత నౌకలు కరాచీ నౌకాస్థావరంపై తీవ్రమైన దాడులు చేసి, పాకిస్థాన్ ప్రధాన నౌకాస్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి.
1971 డిసెంబర్ 4న, భారత నేవీకి చెందిన మూడు యుద్ధ నౌకలు నిఫాత్, నిర్ఘట్, వీర్ కరాచీ వైపు బయలుదేరి వెళ్లాయి.
వీటితో పాటు, పెట్యా తరగతికి చెందిన రెండు మరిన్ని యుద్ధ నౌకలు కిల్టర్, కఛాల్ కూడా కరాచీకి చేరాయి.
భారత నేవీ దాడికి పాక్ యుద్ధ నౌకల్లోని సైనికులు నీళ్లలో దూకి తప్పించుకున్నారు. ఇప్పుడు, 54 సంవత్సరాల తర్వాత, భారత్ మళ్ళీ కరాచీ నేవీ స్థావరాన్ని ధ్వంసం చేస్తోంది.