
Governments Travel Advisory: పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులందరూ తక్షణమే తిరిగి రావాలని తీవ్ర స్థాయిలో సూచనలు జారీ చేసింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం, కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది.
ఈ ఉగ్రదాడి నేపథ్యాన్నే పరిగణలోకి తీసుకుని, ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు ఈ హెచ్చరికలు ఇచ్చింది.
ఇక మరోవైపు, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలకు సన్నద్ధమవుతోందని సమాచారం బయటకు వచ్చింది.
ఇప్పటికే భారత్ పాక్‌పై దౌత్యపరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది.
అంతేకాదు, అవసరమైతే సైనిక స్థాయిలో స్పందించేందుకు కూడా సిద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి
Those Indian nationals currently in Pakistan are also advised to return to India at the earliest: MEA pic.twitter.com/aqjoue5Qan
— Press Trust of India (@PTI_News) April 24, 2025
వివరాలు
పాకిస్తాన్ పౌరుల వీసాల జారీపై కీలక నిర్ణయం
''భారత పౌరులు పాకిస్తాన్‌కి ప్రయాణించకూడదని గట్టిగా హెచ్చరిస్తున్నాము.ఇప్పటికే అక్కడ ఉన్న వారు కూడా వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి రావాలని సలహా ఇస్తున్నాము''అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు, భారత్ ప్రభుత్వంతో సంబంధాల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులకు వీసాల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 27,2025 నుంచి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులకు భారత ప్రభుత్వం జారీచేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే,ఇప్పటికే జారీ అయిన వైద్య వీసాలు మాత్రం ఏప్రిల్ 29,2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు తమ వీసా గడువు ముగిసేలోపు,కొత్త నిబంధనల ప్రకారం దేశాన్ని విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది.