LOADING...
Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండూలో తీవ్ర అల్లర్లు.. విమానాలు రద్దు చేసిన ఇండిగో 
విమానాలు రద్దు చేసిన ఇండిగో

Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండూలో తీవ్ర అల్లర్లు.. విమానాలు రద్దు చేసిన ఇండిగో 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ రాజధాని ఖాట్మండులో చెలరేగిన తీవ్ర అల్లర్ల కారణంగా అక్కడి విమానయాన కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భద్రతా కారణాల వల్ల, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంను అధికారులు తాత్కాలికంగా మూసివేసారు. దీని ఫలితంగా, ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఖాట్మండూకు తమ సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, పలు అంతర్జాతీయ విమానాలను ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు.

వివరాలు 

ప్రయాణికులకు రీఫండ్ లేదా ప్రత్యామ్నాయం అందిస్తామని ఇండిగో ప్రకటన 

"ఖాట్మండూ విమానాశ్రయం మూసివేత కారణంగా, మా విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ అసౌకర్యానికి మేము మన్నించమని తెలియజేస్తున్నాం" అని తెలిపింది. అదే సమయంలో, టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యామ్నాయ విమానంను ఎంచుకోవచ్చు లేదా డబ్బులు రిఫండ్ పొందవచ్చు అని సూచించింది. అలాగే, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికులు తాజా సమాచారం కోసం తమ అధికారిక ప్రకటనలను గమనించాల్సిందిగా సూచన చేసింది.

వివరాలు 

లక్నోలో ల్యాండ్ అవుతున్న విమానాలు 

విమానాశ్రయం మూసివేత కారణంగా, ఖాట్మండూ చేరాల్సిన అనేక విమానాలు లక్నోలో ల్యాండ్ అయ్యాయి. దుబాయ్ నుంచి బయల్దేరిన ఫ్లై దుబాయ్ (FZ539) విమానం మధ్యాహ్నం 3:25 గంటలకు లక్నోలో దిగింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ లయన్ ఎయిర్ (TLM220) విమానం మధ్యాహ్నం 3:05 గంటలకు లక్నో చేరింది. ఢిల్లీ నుంచి బయల్దేరిన ఇండిగో (6E1153) విమానం మధ్యాహ్నం 2:40 గంటలకు లక్నోలో ల్యాండ్ అయ్యింది. ముంబై నుంచి ఖాట్మండూ వెళ్లాల్సిన మరో ఇండిగో (6E1157) విమానాన్ని ముందుగా లక్నోకు, ఆ తర్వాత ఢిల్లీకు మారుస్తూ పంపించారు. ప్రస్తుత పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు, ఖాట్మండూ రాకపోకలపై అనిశ్చితి కొనసాగనుంది. విమానయాన సంస్థలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.