Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
పేదల కల ఆత్మగౌరవంతో జీవించడమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ''రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ పథకానికి ప్రధాన నినాదం. ఇల్లు, వ్యవసాయ భూమి ప్రజల కోసం ఆత్మగౌరవంగా ఉండే అంశాలు. ఈ దృష్టితో ఇందిరా గాంధీ స్వీయ గౌరవాన్ని మించిన విధంగా ఇళ్ల, భూమి పంపిణీ పథకాలను ప్రారంభించారు. దేశంలో గుడి లేని ఊరు ఉండవచ్చు, కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు మాత్రం లేదు'' అని ఆయన అన్నారు. రూ. 10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు రూ. 5 లక్షలకు చేరుకుంది.
ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షల ఆర్థిక సహాయం
ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వ లక్ష్యం,అర్హులైన వ్యక్తులకే ప్రభుత్వ ఇల్లు ఇవ్వడం. గతంలో కేసీఆర్ రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించామని,తొలి దశలో 4.50లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పరిపాలన అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు ప్రారంభం కానుంది. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్‌లను ఏర్పాటు చేయనున్నారు.మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించబడ్డాయి. మొత్తం నాలుగున్నరలక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు,ఒంటరి మహిళలు,ట్రాన్స్‌జెండర్లను మొదటి ప్రాధాన్యతతో పథకంలో చేర్చనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేపట్టనున్నారు.