Page Loader
ఇండోర్ నగరంలో అరుదైన శస్త్ర చికిత్స.. మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు 
ఓ మహిళ కడుపులో భారీ స్థాయిలో ఏర్పడ్డ కణితిని వైద్యులు ఆపరేషన్ నిర్వహించి బయటకు తీసేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జరిగింది.

ఇండోర్ నగరంలో అరుదైన శస్త్ర చికిత్స.. మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 09, 2023
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ మహిళ కడుపులో భారీ స్థాయిలో ఏర్పడ్డ కణితిని వైద్యులు ఆపరేషన్ నిర్వహించి బయటకు తీసేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జరిగింది. గత కొంత కాలంగా క‌డుపు నొప్పితో బాధపడుతున్న 41 ఏళ్ల మహిళ ఇండెక్స్ ఆస్పత్రిలో చేరగా ఆమెకు వివిధ రకాల స్కాన్లు, రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సదరు మహిళా న‌డిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు కడుపులో తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారని వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆమె కడుపులో దాదాపుగా 15 కిలోల భారీ కణితి ఏర్పడిందని, క్రమంగా అది వాపుగా మారిందని పరీక్షల్లో తేల్చారు.

DETAILS

శస్త్రచికిత్స చేసిన 12 మంది వైద్య నిపుణులు

దీంతో దాదాపు 12 మందితో కూడిన వైద్య నిపుణులు, ఓ బృందంగా ఏర్పడ్డారు. అనంతరం కడుపులో ఏర్పడ్డ క‌ణ‌తిని ఓవేరియ‌న్ ట్యూమ‌ర్‌ ఇండెక్స్ గా గుర్తించారు. ఈ మేరకు డా. అతుల్ వ్యాస్ నేతృత్వంలో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు రెండున్న‌ర గంట‌ల పాటు ఆపరేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుతం మ‌హిళ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని డాక్టర్లు వెల్లడించారు. కడుపులో కణితి ప‌గ‌ల‌కపోవడం వల్ల బాధితురాలికి ప్రాణాపాయం తప్పిందని వివరించారు. సుదీర్ఘ సమయం తీసుకుని దాదాపు 15 కిలోల భారీ కణితిని ఆపరేషన్ ద్వారా విజయవంతంగా తొలగించడం పట్ల అటు బాధిత కుటుంబంలోనూ, ఇటు వైద్య వర్గాల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది.