IndiGo flight: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనలో ప్రయాణికులు
దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు వచ్చింది.. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విచారణ అనంతరం బాంబు వార్త పుకారు అని తేలింది. అయితే బాంబు వార్త తెలియగానే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E2211 టాయిలెట్‌లో బాంబు అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యమైందని, ఆ తర్వాత భద్రతా సంస్థలు విచారణ జరిపాయని, అయితే అది బూటకమని తేలిందని సీఐఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బాంబు గురించి సమాచారం అందిన వెంటనే, ఎమర్జెన్సీ గేట్ ద్వారా ప్రయాణికులందరిని విమానం నుండి తరలించారు.
ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులను తరలించారు
అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం, ఈ రోజు ఉదయం 5.35 గంటలకు ఢిల్లీ నుండి వారణాసికి వెళ్తున్న విమానంలో బాంబు గురించి సమాచారం అందింది. QRT సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ డోర్ ద్వారా తరలించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. విమానాన్ని తనిఖీ చేశారు.