LinkedIn: ఉద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. లింక్డ్‌ఇన్ టాప్ 25 కంపెనీల జాబితా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న సమయంలో, లింక్డ్‌ఇన్ దేశంలో కెరీర్ అభివృద్ధికి అనుకూలమైన టాప్ 25 పెద్ద కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇన్ఫోసిస్, అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ సంస్థలు చోటు దక్కించుకోవడం విశేషం. ఉద్యోగుల స్కిల్స్ డెవలప్‌మెంట్, సంస్థలోనే ప్రమోషన్ అవకాశాలు, కొత్త టెక్నాలజీలపై శిక్షణ వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ రూపొందించారు. ప్రస్తుతం ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ కంపెనీలు మంచి అవకాశాలు కల్పించే వేదికలుగా లింక్డ్‌ఇన్ పేర్కొంది. ముఖ్యంగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం,తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు పొందడంలో ఈ సంస్థలు ముందంజలో ఉన్నాయని వెల్లడించింది.
వివరాలు
ఐటీ, స్టార్టప్ రంగాల్లో స్పష్టంగా కనిపిస్తున్న మార్పులు
అంతేకాదు, మే 27 వరకు అన్ని సభ్యులకు ఫ్రీగా లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉంచుతూ, ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచిస్తోంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఉద్యోగాల స్వభావం పూర్తిగా మారిపోతోంది. ముఖ్యంగా ఐటీ, స్టార్టప్ రంగాల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే భారతీయ ఉద్యోగులు ఇప్పుడు 1.8 రెట్లు ఎక్కువగా AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారని డేటా చెబుతోంది. ప్రాంప్ట్ ఇంజినీరింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మేనేజ్‌మెంట్ వంటి టెక్నికల్ స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది.
వివరాలు
స్కిల్స్ ఉన్నవారే ఉద్యోగాల్లో వేగంగా ఎదగగలరు
అయితే టెక్నికల్ నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్, టీమ్‌వర్క్ వంటి మానవ నైపుణ్యాలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కిల్స్ ఉన్నవారే ఉద్యోగాల్లో వేగంగా ఎదగగలరని సూచిస్తున్నారు. మొత్తానికి, డిజిటల్ ఎకానమీకి తగ్గట్టుగా నైపుణ్యాలను పెంపొందించుకుంటే కెరీర్‌లో మంచి అవకాశాలు పొందవచ్చని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ టాప్ 25 జాబితాలో యాక్సెంచర్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, జేపీమోర్గాన్ చేజ్, ఎస్ఏపి, హెచ్ఎస్బిసి, ఎన్విడియా వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కూడా చోటు దక్కించుకున్నాయి.