
కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేయనున్న చారిత్రక వస్తువు గురించి కీలక ప్రకటన చేశారు.
స్పీకర్ సీటు దగ్గర చారిత్రాత్మక బంగారు 'సెంగోల్'ను ప్రతిష్టించనున్నట్లు కేంద్ర అమిత్ షా తెలిపారు.
'సెంగోల్'ను రాజదండగా కూడా పిలుస్తారు.
బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడికి గుర్తుగా ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించినట్లు అమిత్ షా చెప్పారు.
'సెంగోల్'ను తమిళ రాచరికానికి ప్రతీక భావిస్తారు.
సెంగోల్ అనేది తమిళ పదం "సెమ్మై" నుంచి ఉద్భవించింది. సెమ్మై అంటే ధర్మం అని అర్థం.
దిల్లీ
సెంగోల్ చరిత్ర ఇదే
1947లో భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో అధికార మార్పిడికి గుర్తు ఏదైనా చేస్తే బాగుంటుందని బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, జవహర్‌లాల్ నెహ్రూ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి.
అధికార మార్పిడికి సంకేతంగా ఏం చేయాలనేది ఎంతకీ పాలుపోకపోవడంతో అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి(రాజాజీ)ని నెహ్రూ సలహా అడిగారు.
ఈ క్రమంలో చోళుల పాలనలో అధికార మార్పిడి సమయంలో జరిగిన తమిళ సంప్రదాయాన్ని ఈ సందర్భంగా నెహ్రూకు రాజగోపాలాచారి చెప్పారు.
చోళుల పాలనలో కొత్త రాజు అధికారంలోకి రాగానే బంగారపు రాజదండాన్ని అప్పగిస్తారు.
ఇప్పుడు అదే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుటుందని రాజాజీ చెప్పడంతో నెహ్రూ ఓకే అనేశారు.
దిల్లీ
న్యాయానికి ప్రతీకగా రాజదండంపై నంది ప్రతిమ
భారతదేశ స్వాతంత్రానికి గుర్తుగా రాజాదండాన్ని అప్పటికప్పుడు తాయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడకున్న పని అని రాజాజీ భావించారు.
వెంటనే తమిళనాడులోని ప్రముఖ మఠమైన తిరువడుతురై అథీనంను సంప్రదించారు.
ఆ మఠాధిపతి మద్రాసులోని నగల వ్యాపారి వుమ్మిడి చెట్టికి బంగారపు రాజదండాన్ని తయారు చేసే బాధ్యతలను అప్పగించారు.
వుమ్మిడి చెట్టి 5అడుగుల పొడవు, దాని పైన న్యాయానికి ప్రతీక అయిన 'నంది'తో కూడిన సెంగోల్‌ను తయారు చేశారు.
స్వాతంత్రం రావడానికి సరిగ్గా 15నిమిషాల ముందు, సెంగోల్‌ను గంగాజలంతో శుద్ధి చేసి, మౌంట్ బాటన్‌కు పూజారి అప్పగించారు.
ఆ తర్వాత ఆ రాజదండాన్ని అప్పటి ప్రధాని నెహ్రూకు మౌంట్ బాటన్ అందజేశారు.
ఆ రాజదండం నెహ్రూ అందుకోవడంతో అధికారాల బదిలీ అధికారికంగా జరిగినట్లుయ్యింది.