Page Loader
'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ
'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ

'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ

వ్రాసిన వారు Stalin
Mar 25, 2023
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్నదని, 'సబ్ కా ప్రయాస్' ద్వారా ప్రతి ఒక్కరి కృషి ద్వారానే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో శనివారం శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో అభివృద్ధి చెందిన బాటలో నడవాలని భారత్ సంకల్పించిందని మోదీ అన్నారు. ఇంత తక్కువ సమయంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రజలు చాలా సార్లు అడుగుతున్నారని, అయితే అందిరి కృషితో ఇది సాధ్యమవుతుందని మోదీ చెప్పారు.

ప్రధాని మోదీ

పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం

గత తొమ్మిదేళ్లలో, భారతదేశంలో ఆరోగ్య సేవలకు సంబంధించి చాలా నిజాయితీగా, సమర్ధవంతంగా పని చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. దేశంలో వైద్య విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణను పెంపొందించడంలో ప్రభుత్వ కృషి ఉందని, పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి ఇది ప్రాధాన్యతనిస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కర్నాటకలో 9,000కు పైగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఉన్నాయని ప్రధాని చెప్పారు. అంతకుముందు, ఆధునిక మైసూరు (ప్రస్తుతం కర్ణాటక) వాస్తుశిల్పిగా పరిగణించబడే సర్ ఎం విశ్వేశ్వరయ్య స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన ప్రధాన మంత్రి, ఆయనకు అంకితం చేసిన మ్యూజియాన్ని కూడా సందర్శించారు. ప్రధాని వెంట కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉన్నారు.