
One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
2025 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యంగా భారత్ పని చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందే భారత్ టార్గెట్‌ను చేరుకుంటుందని పేర్కొన్నారు.
వారణాసిలో శుక్రవారం జరిగిన 'వన్ వరల్డ్ టీబీ సమ్మిట్'లో టీబీని అంతం చేసే దిశగా పురోగతి సాధించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు.
భారతదేశం 'ఒకే భూమి, ఒకే ఆరోగ్యం' అనే విజన్‌ని కొంతకాలం క్రితం ప్రారంభించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పుడు 'వన్ వరల్డ్ టిబి సమ్మిట్' ద్వారా భారతదేశం ప్రపంచ మంచికి సంబంధించిన మరొక తీర్మానాన్ని ప్రతిపాదిస్తోందన్నారు.
ప్రధాని మోదీ
టీబీ మందులు 80శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయ్: మోదీ
వారణాసిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ హై కంటైన్‌మెంట్ లాబొరేటరీకి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, టీబీ రహిత సమాజాన్ని నిర్మించడంలో తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించిందన్నారు.
2018లో టీబీ రోగులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీని ప్రకటించినట్లు చెప్పారు. సుమారు 75 లక్షల మంది రోగులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు పేర్కొన్నారు.
టీబీ మందులు 80శాతం భారతదేశంలోనే తయారవుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న భారత ఫార్మా రంగం ప్రతిభ సామర్థ్యానికి ఇది నిదర్శనం అన్నారు.