ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌లోని దేవ్‌నగర్‌లోని అగస్త్యముని నగర్ ప్రాంతంలోని బునియాడి వార్డులో ఈ ఘటన జరిగింది. బాలుడు రోడ్డు దాటుతుండగా బైక్ బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు చెప్పారు.
మోటారు సైకిల్ ఢీకొట్టిన వీడియో సీసీటీవీలో రికార్డు కాగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరాఖండ్
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి కుటుంబ సభ్యులు
ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రుద్రప్రయాగ్‌కు తరలించినట్లు సదానంద్ పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ పోఖ్రియాల్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
చిన్నారి షాపు నుంచి సరుకులు తీసుకునేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన అపాచీ బైక్ ఢీకొట్టిందని పోఖ్రియాల్ పేర్కొన్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసు, బైక్‌ను సీజ్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.