sunkishala project: సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు అంతర్జాతీయ నిపుణులు
సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం త్వరలో రానుంది. నీటి మునిగిన పంపుహౌస్‌ను పరిశీలించి, తొందరగా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు గత్తేదారు సంస్థలకు సూచనలు ఇవ్వనుంది. దీనిపై జలమండలి కూడా ఓ నివేదిక సమర్పించనుంది. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్స్ ప్రాంతంలో నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు పంపుహౌస్ ఇటీవల నీట మునిగింది. సాగర్‌లో వరద నీరు పోటెత్తడంతో పంపుహౌస్ సోరంగ మార్గం ద్వారా జలాలు తన్నుకొచ్చి మొత్తం మునిగిపోయింది.
పనుల పునరుద్ధరణకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు
దీనివల్ల పంపుహౌస్‌కు ఒకవైపు రక్షణ గోడ కూడా పూర్తిగా కుప్పకూలింది. దీంతో గుత్తేదారు సంస్థకు రూ.20-30 కోట్ల వరకు నష్టం వాటిల్లందన్నారు. ఈ నిబంధనల ప్రకారం ఈ ఖర్చునంతా గుత్తేదారు సంస్థే భరించాలి. తాజాగా పంపుహౌస్ పనుల పునరుద్ధరణకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికోసం వివిధ దేశాల్లో ఉన్న సాంకేతికతను పరిశీలించనున్నారు. పనుల కొనసాగింపు సాధ్యాసాధ్యాలపై నిపుణుల బృందం ఓ అంచనాకు రానున్నట్లు ఓ అధికారులు పేర్కొన్నారు.